Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండా సురేఖ గొంతు వినిపించింది.. హిజ్రాలపై నోరెత్తారు.. పెన్షన్ ఇవ్వాలని డిమాండ్..

సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వెంటే ఉండే కొండా సురేఖ గుర్తుండే వుంటారు. ఆమె రాష్ట్రం చీలిపోయాక తెలంగాణ రాష్ట్ర సమితిలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (16:59 IST)
సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వెంటే ఉండే కొండా సురేఖ గుర్తుండే వుంటారు. ఆమె రాష్ట్రం చీలిపోయాక తెలంగాణ రాష్ట్ర సమితిలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ.. చాలా గ్యాప్ తర్వాత వార్తల్లోకెక్కారు. హిజ్రాల సంక్షేమంపై నోరు విప్పారు. తాజాగా హిజ్రాల సమస్యలను అసెంబ్లీలో చర్చకు లేవనెత్తారు. ప్రభుత్వం కేటాయించిన స్వయం ఉపాధి బడ్జెట్ కేటాయింపులు రూ.550కోట్లలో కొంత హిజ్రా జీవనభృతికి కేటాయించాలని ఆమె సూచించారు.
 
ఇటీవల ఒంటరి స్త్రీలకు ప్రభుత్వం రూ.వెయ్యి పెన్షన్ ప్రకటించిన నేపథ్యంలో.. హిజ్రాలను ఒంటరి స్త్రీలుగా గుర్తించి వారికి పెన్షన్ అందజేయాలని కోరారు. హిజ్రాలకు జీవనోపాధి చూపించే ప్రయత్నం చేయాలన్నారు. హిజ్రాలను సమాజం కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వాళ్లెంత పెద్ద చదువులు చదివినా.. ఎవరూ ఉద్యోగాలు మాత్రం ఇవ్వట్లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటన చేస్తూ బతుకుతున్నారని కొండా సురేఖ వెల్లడించారు.
 
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలోనూ, ఎన్నికల ప్రచారాల్లో సైతం హిజ్రాలు పాల్గొనడాన్ని ఈ సందర్బంగా సురేఖ గుర్తుచేశారు. కొండా సురేఖ మాట్లాడిన తర్వాత దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. ఈ విషయాన్ని సీఎంతో చర్చించి సరైన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments