Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 16లోపు నిర్వహించాలి : హైకోర్టు

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (15:54 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను వచ్చే డిసెంబర్ 16వ తేదీలోపు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రతినిధి పద్మనాభ రెడ్డి వేసిన పిటిషన్‌ ఆధారంగా విచారణ జరిపిన కోర్టు సోమవారం ఉదయం ఈమేరకు తీర్పును వెలువరించింది.
 
అక్టోబరు నెల 31లోగా వార్డుల విభజన రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి మరో 45 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందే అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆరు నెలలకు మించి గడువు కావాలని ప్రభుత్వం తరపున లాయర్‌ కోర్టును కోరారు.
 
ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలన ఉన్నందున అదనపు సమయం ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. 225 రోజుల గడువు ఇస్తున్నామని ఆలోపు ఎలక్షన్స్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments