Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మంజిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (07:26 IST)
రెండు లారీలలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల విలువ చేసే 410 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని ఖమ్మంజిల్లా తల్లాడ  పోలీసులు పట్టుకున్నట్లు వైరా ఏసీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు.

ప్రభుత్వం నిరుపేదలకు రేషన్‌ దుకాణాల ద్వారా సబ్సిడీపై అందిస్తున్న బియ్యాన్ని రేషన్ దుకాణాల నుంచి  తక్కువ ధరలకు సేకరించి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో.. సీఐ వసంతకుమార్, పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న తల్లాడ ఎస్సై తిరుపతి రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వై.సాంబశివరావు, సిబ్బందితో తల్లాడ ప్రధాన రహదారి రెడ్డిగూడెం వద్ద ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. 
 
అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు లారీలను ఆపి తనిఖీ చేశారు. 410 క్వింటాళ్ల రేషన్  బియ్యం ఎలాంటి పత్రాలు లేకుండా  తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారని ఏసీపీ తెలిపారు. 

జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్లు తోట రవికుమార్, బిట్రా పుల్లారావును అదుపులోకి తీసుకొని విచారించారు. సేకరించిన రేషన్ బియ్యాన్ని ఖమ్మం మీదుగా కాకినాడకు తరలిస్తునట్లు వారు తెలిపారని ఏసీపీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments