Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాకు అతి భారీ వర్ష సూచన.. 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (11:08 IST)
తెలంగాణంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీచేసింది. సోమవారం 11 జిల్లాలకు, మంగళవారం 10 జిల్లాలకు ఈ హెచ్చరిక చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నాలుగు జిల్లాలకు ఈ తరహా హెచ్చరికను జారీచేసింది. 
 
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, పాలమూరు, నారాయణపేట జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. కొమరం భీం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటిలో పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 18 జిల్లాలలు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. 
 
అదేవిధంగా గత 24 గంటలుగా ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. నంద్యాల, ప్రకాశం, కడప, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 
 
వివాహితపై వాలంటీర్ అత్యాచారయత్నం 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ఇష్టారీతిలో ప్రవర్తిస్తున్నారు. చోరీలు, దోపిడీలు, అత్యాచారయత్నాలు, హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆళ్ళవారి పంచాయతీ పరిధిలోని బాప్టిస్టు పాళెంలో ఓ వాలంటీర్ ఓ వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇంటి అరుగుపై కూర్చొనివున్న వివాహితను వాలంటీరు చేయిపట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లి బలవంతంగా అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... బాప్టిస్టు పాళెంకు చెందిన ఓ వివాహిత ఆదివారం ఇంటిముందు అరుగుపై కూర్చున్నారు. ఆ సమయంలో వాలంటీరు గాలిమోటు లోకకుమార్ ఆమె వద్దకు వచ్చి 'నువ్వంటే నాకు ఇష్టం' అంటూ ఆమె చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె వెంటనే తేరుకుని, చేయి విడిపించుకుంటూ కేకలు వేశారు. ఎందుకు అరుస్తున్నావంటూ అతడు కాలితో తన్నడంతో ఆమె పడిపోయారు. చుట్టుపక్కల వారు రావడంతో 'నీ అంతు చూస్తా.. నన్ను ఎవ్వడూ ఏం చేయలేరు' అంటూ అక్కడ నుంచి జారుకున్నాడు. 
 
కాసేపటికి తన బంధువులు, అనుచరులతో కర్రలు తీసుకుని వచ్చాడు. వారి దాడి నుంచి తప్పించుకుని, బాధితురాలిని ఆమె బంధువులు ఆటోలో తీసుకుని చెరుకుపల్లి వచ్చారు. నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది కూడా ఇలాగే ఈ వాలంటీరే తనతో అమానుషంగా ప్రవర్తించాడని, అప్పుడు పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. వాలంటీరే దౌర్జన్యం చేసి, తిరిగి వారిపైనే కేసులు పెడతాడని, అదేమంటే తన వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నారంటూ బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు.
 
వాలంటీరు, అతని అనుచరులు, బంధువులతో తనకు, తన బంధువులకు ప్రాణహాని ఉందని తెలిపారు. వాలంటీరు లోకకుమార్ గ్రామంలో తనలాంటి వారి నుంచి వడ్డీకి డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకపోగా, దిక్కున్నచోట చెప్పుకోవాలని దౌర్జన్యం చేస్తున్నాడని వార్డు సభ్యురాలు మరియమ్మ వాపోయారు. తాము వైకాపా వారిమేనని, వాలంటీరు అరాచకాలకు తట్టుకోలేకపోతున్నామని కొందరు మహిళలు పోలీసుల వద్ద విలపించారు. పింఛను ఇచ్చే నెపంతో వాలంటీరు ఇళ్లకు వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అందుకే అతడిని తాము ఇళ్లకు రానీయడం లేదని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments