బీజేపీలో చేరనున్న హరీష్ రావు : ఆంగ్ల పత్రిక కథనం

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (11:59 IST)
తెరాస సీనియర్ నేతల్లో ఒకరు, మాజీ మంత్రి టి.హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం అటు తెరాస పార్టీలోనే కాకుండా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. 
 
ఇప్పటికే రాజకీయంగా హరీశ్ రావు ఊగిసలాటలో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ఈ వార్తను ఆ పత్రిక ప్రచురించింది. చివరిలో "ఇది ఏప్రిల్ ఫూల్ డే అని పాఠ‌కులు గుర్తుంచుకోవాలి" అన్న వాక్యాన్ని చూసేంత వరకూ ఈ వార్తను నిజమని నమ్మి ఆతృతగా లక్షలమాది మంది పాఠకులు చదివారు. 
 
వాస్తవానికి ఓ పదేళ్ల క్రితం వరకూ ఏప్రిల్ 1న ఈ తరహా వార్తలను అన్ని దినపత్రికలూ ప్రచురించి, చివరిలో ఇది 'ఫూల్స్ డే' అని గుర్తు చేస్తుండేవి. కాలానుగుణంగా ఆ సంప్రదాయం తొలగిపోయింది. అటువంటి సమయంలో హరీశ్ రావుపై బ్యానర్ కథనంగా 'ఫూల్స్ డే స్టోరీ'ని ప్రచురించడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments