Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరోనా కల్లోలం... సగం కేసులు అక్కడే నమోదు

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (09:54 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ.. కరోనా వైరస్‌ వ్యాప్తిని మాత్రం అరికట్టలేక పోతోంది. దీంతో ఈ రాష్ట్రంలో నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు డబుల్ సెంచరీని దాటిపోయింది. అలాగే, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11కు చేరింది. 
 
అయితే, తెలంగాణాలో వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరగిపోతున్నాయి. ముఖ్యంగా, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 2వ తేదీ వరకు 154 కేసులు నమోదవగా అందులో సగం కేసులు (76) గ్రేటర్ పరిధిలోనే నమోదయ్యాయి. 
 
హైదరాబాద్‌‌లో 50, రంగారెడ్డిలో 15, మేడ్చల్‌లో 11 కేసులు గుర్తించారు. ఈ మూడు జిల్లాల తర్వాత వరంగల్ అర్బన్ (18), కరీంనగర్ (17) ఎక్కువ ప్రభావం ఉంది. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ఇప్పటిదాకా 20 జిల్లాల్లో ఈ ప్రాణాంతక  వైరస్ బారిన పడిన రోగులను గుర్తించారు.
 
నిజానికి విదేశాల నుంచి వచ్చిన వారిలోనే వైరస్ లక్షణాలు కనిపించగా... కొద్ది రోజుల నుంచి స్థానికుల్లోనే ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే, వారంతా ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వాళ్లే కావడం గమనార్హం. 154 కేసుల్లో దాదాపు సగం మంది మర్కజ్‌ బాధితులే. 
 
ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 75 మందికి పాజిటివ్ తేలింది. వారి ద్వారా కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరో 33 మందికి వైరస్ సోకింది. మర్కజ్‌‌కు వెళ్లొచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారితో కలిసి మొత్తంగా 108 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.
 
మత ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లొచ్చిన కుటుంబాల్లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఓల్డ్ సిటీ, కుత్చుల్లాపూర్, నాంపల్లికి చెందిన ఆరు కుటుంబాల్లోనూ నాలుగు కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments