Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో స్కామ్ జరిగింది.. నచ్చినవారికే..!: కాంగ్రెస్ ఎంపీ గుత్తా

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (13:53 IST)
రైతులకు ఇచ్చే సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. అంతగా ఆదరణలేని ట్రాక్టర్ల కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం వెనక మతలబు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి, విజిలెన్స్ శాఖకు లేఖ రాసినట్లు చెప్పారు. ఎంట్రీ ట్యాక్స్ వివాదంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూర్చొని చర్చలు జరపాలన్నారు. దీనిపై కేంద్రం జ్యోకం చేసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
 
సబ్సిడీ ట్రాక్టర్లను రైతులకు కాకుండా టీఆర్ఎస్ నేతలకే ఇస్తున్నారని గుత్తా విమర్శించారు. లబ్దిదారుల ఎంపిక అధికారం మంత్రులకు ఇవ్వడం వల్ల వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ రైతులకు అన్యాయం జరిగిందని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయకుండా మంత్రులు తమకు నచ్చినవారికే ట్రాక్టర్లు ఇస్తున్నారని మండిపడ్డారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments