Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ అధికారాలపై రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు : టీఎంపీలు

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (15:13 IST)
హైదరాబాద్‌లో గవర్నర్ అధికారాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయనను కలిసిన తెరాస ఎంపీలు మీడియాకు వెల్లడించారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు గురువారం ఉదయం రాజ్‌నాథ్‌తో సమావేశమైన విషయం తెల్సిందే. 
 
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాదుపై అధికారాలను గవర్నరుకు అప్పగించడంపై ప్రధానంగా తమ భేటీలో చర్చించినట్టు చెప్పారు. విభజన చట్టం సెక్షన్-8 కింద రాష్ట్రాల అధికారాలను కేంద్రం తీసుకోవడం సరికాదని హోంమంత్రికి చెప్పామని వారు తెలిపారు. గవర్నరుకు ప్రత్యేక అధికారాలు కల్పించడం... రాష్ట్రాల హక్కులను హరించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విధానాన్ని గౌరవించాలని చెప్పారు. భేటీ సందర్భంగా... అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణకు కూడా అధికారాలుంటాయని... రాష్ట్ర అధికారాలను హరించి వేయమని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారని కె కేశవ రావు వెల్లడించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments