Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022 ఆగస్టు 15 తర్వాత ప్రభుత్వం రద్దు: రేవంత్‌రెడ్డి

Webdunia
శనివారం, 10 జులై 2021 (06:56 IST)
కేసీఆర్‌‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్‌, తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాడని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ ఇవ్వడని ఆయన స్పష్టం చేశారు.

అమరవీరుల స్థూపం పేరుతో పెద్ద దోపిడీ జరిగిందన్నారు. నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏంటి?  విమర్శలు చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏ పార్టీ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ టీఆర్ఎస్‌కి ఎలా అధ్యక్షుడో,  తాను కాంగ్రెస్‌కు అధ్యక్షుడినని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

కేసీఆర్ కేబినెట్‌లో 75 శాతం మంత్రులు టీడీపీవారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హరీష్‌రావు, కేటీఆర్‌కు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్, టీడీపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. టీ కాంగ్రెస్ టీడీపీ అయితే, టీఆర్ఎస్‌ కూడా టీడీపీనేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్‌ను తరమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

మోసానికి, దోపిడీకి మారుపేరు కల్వకుంట్ల కుటుంబమని ఆయన ఆరోపించారు. అధికారాన్ని టీఆర్ఎస్‌ నుంచి బరాబర్ గుంజుకుంటామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. "నాకు పీసీసీ వచ్చింది కాబట్టే.. కిషన్‌రెడ్డికి కేబినెట్‌ పదవి" వచ్చిందని రేవంత్‌ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments