Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీమ్ నన్ను సీఎంగా చూడాలనుకున్నాడు... నాకు అతడు బాగా తెలుసు... ఐతే ఏంటి? ఆర్.కృష్ణయ్య

తెలంగాణ గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమైనప్పటికీ అతడి డైరీ మాత్రం పలువురు నాయకులను బయటకు లాగుతూనే ఉంది. ఇకపోతే తాజాగా నయీమ్ తో స్నేహసంబంధాలను కొనసాగించినట్లు తెలుగుదేశం ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆయన ఓ టెలివిజన్ ఛాన

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (20:47 IST)
తెలంగాణ గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమైనప్పటికీ అతడి డైరీ మాత్రం పలువురు నాయకులను బయటకు లాగుతూనే ఉంది. ఇకపోతే తాజాగా నయీమ్ తో స్నేహసంబంధాలను కొనసాగించినట్లు తెలుగుదేశం ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆయన ఓ టెలివిజన్ ఛానల్ తో ఈ విషయమై మాట్లాడారు. నయీమ్ తను కలిసి రాడికల్ ఉద్యమ సమయంలో పని చేశామని తెలిపారు. 
 
తనను తెలంగాణకు సీఎంగా చూడాలన్నది నయీమ్ కల అని సంచలన వ్యాఖ్యలు చేశారు కృష్ణయ్య. 1986 నుంచి తనకు నయీమ్ తెలుసని చెప్పారు. ఐతే నయీత్ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. అతడితో కేవలం స్నేహంగా మాట్లాడేవాడినని తెలిపారు. అంతకుమించి ఏమైనా ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా తను సిద్ధమేనని తెలిపారు. 
 
నయీంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధాలున్నాయనీ, సీబీఐతో దర్యాప్తు చేయిస్తే అన్నీ బయటకు వస్తాయని తెలిపారు. నయీమ్ డైరీ ఎక్కడ ఉందో మీడియా ముందు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు కాకుండా అయితే తనలాంటి బడుగు నేతలనే టార్గెట్ చేస్తారనీ, సీబీఐ దర్యాప్తు చేస్తే పెద్ద తలకాయలు బయటకు వస్తాయని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments