Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇల్లు ఖాళీ చేసి సామాగ్రిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లు : లేడీ డాక్టర్‌కు బెదిరింపు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:59 IST)
కరోనా వైరస్ బారినపడుతున్న రోగులకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు, ఇతర సహాయక సిబ్బంది లేనిపోని సమస్యల్లో పడుతున్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్ళలో నివసించే వారికి ఆ గృహ యజమానుల నుంచి బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. వైద్యులను బెదిరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
తాజాగా సికింద్రాబాద్ నగరంలో స్విగ్దా అనే మహిళా వైద్యురాలికి గృహ యజమాని నుంచి తీవ్ర వేధింపులు వచ్చాయి. ఈ వైద్యురాలి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో సేవలు అందిస్తోది. పైగా, కరోనా రోగులకు వైద్యం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఇంటి యజమాని... ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. 
 
ఆమె ఓ మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో డాక్టర్ స్విగ్ధా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఉంటోన్న ఇంటి యజమాని నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని, తన సామగ్రిని తీసుకెళ్లి గాంధీ ఆసుపత్రిలో పెట్టుకోవాలని వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆమె తెలిపింది. 
 
ఈ విషయాన్ని ఆమె తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. ఇలా బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments