దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో మంటలు - బోగీ పూర్తిగా దగ్ధం

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (10:01 IST)
సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీ బయలుదేరిన దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. భువనగిరి దగ్గరలోని పగిడిపల్లి మధ్య శనివారం అర్థరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు చివరి బోగీలో ఈ మంటలు కనిపించాయి. ఇది లగేజీ బోగీ అని రైల్వే అధికారులు తెలిపారు. మంటలను గమనించిన సిబ్బంది డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. 
 
అయితే, చివరి బోగీ కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక దళ సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తతో విడిపోతున్న నటి మౌనీరాయ్.... స్పందించిన బాలీవుడ్ నటి

iBOMMA: ఆన్‌లైన్‌లో తిరిగి ప్రత్యక్షమైన ఐబొమ్మ.. షాకైన సినీ ప్రపంచం

Ali apology : నటుడు అలీ సోప్ యాడ్ వివాదంతో క్షమాపణ చెప్పాడు

Bunny Vas : మూడు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ మన చేతుల్లో లేదు : బన్నీవాస్

కన్నడ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత

తర్వాతి కథనం
Show comments