Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. భార్యను చంపేశాడు.. ఆపై ప్రియురాలి భర్తను కూడా..?

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (11:14 IST)
ఓ వ్యక్తితో పాటు మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన మహిళ మరణాన్ని హత్యగా తేల్చేశారు పోలీసులు. ఈ రెండు హత్యలకు వివాహేతర సంబంధమే కారణం. పక్కా ప్లాన్ ప్రకారం వివాహేతర సంబంధంలో వున్న ఆ ఇద్దరు మూడు నెలల క్రితం భార్యను ప్రియుడు హత్య చేస్తే.. ప్రియుడి సాయంతో ప్రియురాలు భర్తను హత్య చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. 
 
ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాహుల్ హెగ్డే శుక్రవారం వెల్లడించారు. చివ్వెంల మండలం కుడకుడలో భూక్య వెంకన్న-రమాదేవి దంపతులు నివసిస్తున్నారు. షేక్ రఫీ-నస్రీన్ అద్దె ఇంట్లో ఉంటున్నారు. రఫీ భార్య నస్రీన్‌తో వెంకన్నకు వివాహేతర సంబంధం ఉంది. 
 
ఈ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. అయితే తమ వివాహేతర సంబంధానికి భార్య రమాదేవి అడ్డుగా ఉందని, భర్త రఫీ అడ్డుగా ఉన్నారని వెంకన్న, నస్రీన్‌లు భావించారు. భార్యాభర్తల అడ్డంకి తొలగిపోయేలా ప్రణాళిక రూపొందించారు. 
 
జులై 8న రాత్రి వెంకన్న తన భార్య రమాదేవితో కలిసి బైక్‌పై సూర్యాపేటకు బయల్దేరి మూత్ర విసర్జన చేస్తానంటూ చందుపట్ల సమీపంలో బైక్‌ను ఆపాడు. దీంతో రమాదేవి తల విద్యుత్ స్తంభానికి బలంగా కొట్టింది.
 
 ఆమె చనిపోయింది. దీన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు. 
 
వెంకన్న బైక్‌ను కింద పడవేయడంతో కాళ్లు, చేతులు దెబ్బతిన్నాయి. ఆ గాయాలతో రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. రోడ్డు ప్రమాదంలో రమాదేవి చనిపోయిందని అందరూ భావించారు. దీంతో వెంకన్న నస్రీన్‌తో కలిసి రఫీని చంపేందుకు పథకం వేశాడు. 
 
వెంకన్న తన స్నేహితులైన మోతె మండలం సిరికొండకు చెందిన జూనియర్ లైన్‌మెన్ అక్కనపల్లి శ్రీశైలం, నామవరం గ్రామానికి చెందిన సరగండ్ల మధులకు సమాచారం అందించాడు. ఈ నెల 9న రఫీ ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. నస్రీన్ వెంకన్నకు విషయం చెప్పింది. 
 
వెంకన్న తన స్నేహితులు శ్రీశైలం, మధుతో కలిసి నస్రీన్ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో రఫీ మద్యం తాగి ఇంటికి రాగానే వెంకన్న, శ్రీశైలం, మధు గొంతుకోసి హత్య చేశారు. రఫీ మెడకు చీర కట్టి ఫ్యాన్‌కు వేలాడదీశారు. 
 
మరుసటి రోజు నస్రీన్ రఫీ ఉరివేసుకుని చనిపోయాడని బంధువులకు, పోలీసులకు సమాచారం అందించింది. రఫీ శరీరంపై గాయాలు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదిక రావడంతో పోలీసులు నస్రీన్‌ను ప్రశ్నించారు. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి వెంకన్న, నస్రీన్, మధు, శ్రీశైలంలను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments