ఈటల రాజేందర్‌పై అనర్హత అస్త్రం... సిద్ధంగా తెరాస

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (10:27 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్త‌రఫ్‌కు గురైన మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మెడపై అనర్హత కత్తి వేలాడుతుంది. ఆయన బీజీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైంతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా బీజేపీలో చేరితే, ఆయనపై అనర్హత వేటు వేయాలని అధికార టీఆర్‌ఎస్‌ అధిష్టానం అసెంబ్లీ స్పీకర్‌ను కోరనుంది. 
 
భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తర్‌ఫకు గురైన టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరటం ఖాయమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 
 
ఒకవేళ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే, బీజేపీ చేరితే మాత్రం చూస్తూ ఊరుకోవద్దని వారు భావిస్తున్నారు. ఈటల బీజేపీలో చేరిన వెంటనే, ఆయనపై అనర్హత వేటు వేయాలని తమ పార్టీ నాయకత్వం అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి లిఖితపూర్వకంగా కోరుతుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments