Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజెపిలోకి ఈటల- రంగంలోకి దిగిన బీజేపీ హైకమాండ్

Etala Rajender
Webdunia
శనివారం, 1 మే 2021 (22:03 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహానికి గురైన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు బిజెపి జాతీయ నాయకత్వం ఈటెల రాజేంద్ర తో నేరుగా సంప్రదింపులు చేసినట్లు సమాచారం.

తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ తో ఫోన్లో మంతనాలు చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర పార్టీ నీ నుంచి ప్రతినిధులను ఈటల రాజేందర్ వద్దకు పంపించి మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ రాష్ట్రంలో బలపడేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  యోచిస్తుంది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పార్టీలో సీనియర్‌గా పేరుపొందిన బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను అవమానకర రీతిలో మంత్రి పదవిని లాక్కోవడంతో బలహీన వర్గాల నాయకులను అణిచి వేస్తున్నారన్న విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. భూకబ్జా కేసులో ఇరికించి జైలుపాలు చేయాలనే యోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కుటిల పన్నాగం తిప్పికొట్టేందుకు బిజెపిలో చేరడమే శ్రేయస్కరంగా ఈటల రాజేందర్ కూడా భావిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇందుకు సంబంధించిన చర్చోపచర్చలు ఈ మధ్యాహ్నం నుంచి కంటిన్యూగా కొనసాగుతున్నట్లు తెలిసింది. కేంద్రం నుంచి వచ్చిన బీజేపీ ప్రతినిధులు ఈటెల రాజేందర్‌తో మంతనాలు జరుపుతున్న సమయంలో నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రితో స్వయంగా ఈటల రాజేందర్ మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈటెల రాజేందర్ బిజెపిలో చేరడం అనే విషయం టిఆర్ఎస్‌కి షాక్ లాంటిదే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments