Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలోని గ్రానైట్ కంపెనీల్లో ముమ్మరంగా ఐటీ - ఈడీ సోదాలు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (16:02 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రానైట్ కంపెనీల యజమానుల గృహాల్లో ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూకుమ్మడిగా సోదాలకు దిగారు. ఈ కంపెనీలు విదేశీ మారకద్రవ్య చట్టం ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రావడంతో ఐటీ, ఈడీ అధికారులు సోదాలకు దిగారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు దాదాపు 30 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్‌లో ఈ సోదాలు చేశారు. 
 
ఐటీ శాఖ అధికారులు తోడుగా హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ, అత్తాపూర్‌లో పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగరులోని గ్రానైట్ వ్యాపాలే లక్ష్యంగా ఈ సోదాలు చేస్తున్నారు. క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
మరోవైపు, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ సోదాలు చేస్తున్నారు. కరీంనగర్‌లోని గంగుల ఇంటితో పాటు మంకమ్మతోటలో ఉన్న కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్స్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
గ్రానైట్ రాళ్ల ఎగుమతుల్లో భాగంగా పలు గ్రానైట్ కంపెనీలు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో ఇదివరకే ఎనిమిది సంస్థలకు ఈడీ నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్.ఆర్.ఆర్. బిహైండ్, బియాండ్ వీడియోను విడుదలచేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్

అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసుల అప్పీల్?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments