Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిందని డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు.. శ్మశానికి తీసుకెళ్తుంటే కళ్లు తెరిచింది...

బరువు తక్కువుతో జన్మించిన ఓ ఆడశిశువు చనిపోయిందని నిర్ధారిస్తూ వైద్యులు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దీంతో అంత్యక్రియలు చేసేందుకు శ్మశానికి తీసుకెళుతుంటే ఆ శిశువు కళ్లు తెరిచింది. దీంతో ఒక్కసారి అవాక్కైన

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (16:48 IST)
బరువు తక్కువుతో జన్మించిన ఓ ఆడశిశువు చనిపోయిందని నిర్ధారిస్తూ వైద్యులు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దీంతో అంత్యక్రియలు చేసేందుకు శ్మశానికి తీసుకెళుతుంటే ఆ శిశువు కళ్లు తెరిచింది. దీంతో ఒక్కసారి అవాక్కైన తల్లిదండ్రులు.. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన ఈ ఆశ్చర్యకర సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని పెగడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, స్వప్న దంపతులకు బరువు తక్కువతో ఓ శిశువు జన్మించింది. దీంతో చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మూడు రోజులు చికిత్స తర్వాత పాప చనిపోయిందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ప్రాణాలతో ఉన్న మూడు రోజుల పసికందు చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. 
 
చిన్నారి మృతి చెందిందని మరణ ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారు వైద్యులు. ఈ క్రమంలో పాపను అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. చిన్నారి కదలడం చూసి మళ్లీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. పసికందుకు వైద్యులు మళ్లీ చికిత్స అందిస్తున్నారు. వైద్యుల తీరుపై పాప కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments