తెలంగాణ రాజ్‌భవన్‌ సిబ్బంది కోసం గవర్నర్‌ ఏం చేశారో తెలుసా?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (07:46 IST)
రాజ్​భవన్​ సిబ్బంది, వారి కుటుంబసభ్యుల కోసం గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ రాజ్​భవన్​లోని సంక్షేమ భవన్​లో యోగా తరగతులను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్యకృత్యంగా మార్చుకోవాలని సూచించారు.

హైదరాబాద్ రాజ్‌భవన్​లోని సంక్షేమ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యోగా తరగతులను ప్రారంభించారు. రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరగతుల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు.

ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు నిర్వహించిన ఆ యోగా తరగతుల్లో గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, సలహాదారు ఏపీవీఎన్ శర్మతో పాటు సుమారు 200 మంది సిబ్బంది కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ప్రతిరోజూ యోగా చేద్దాం: గవర్నర్ ప్రతి రోజు యోగా తరగతుల్లో పాల్గొనాలని గవర్నర్ కోరారు. ప్రధాని పిలుపుచ్చిన 'ఫిట్ ఇండియా' ఉద్యమానికి బలం చేకూరేలా ప్రతి రోజు అందరం యోగా చేద్దామన్నారు.

రాజభవన్‌ స్కూల్‌లో 6 నుంచి 10వ వరకు చదువుతున్న 450 మంది విద్యార్థులకు ప్రతి శనివారం ఈ అంశంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తమిళిసై వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments