Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యవసాయేతర ఆస్తుల వివరాలను సేకరించవద్దు: ధరణీ పోర్టల్ పైన హైకోర్టు స్టే

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (20:45 IST)
హైదరాబాదు, రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ధరణీ పోర్టల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ధరణీ పోర్టల్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేయరాదని స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలు, ఆస్తుల నమోదుపై దాఖలైన పలు ఫిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారించింది.
 
భద్రతాపరమైన నిబంధనలు పాటించకుండా వ్యవసాయేతర భూముల వివరాలు నమోదు చేయడంతో ఇబ్బందులు తలెత్తుతాయని, కావున అప్పటివరకు ఎలాంటి వివరాలను నమోదు చేయకూడదని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. అయితే ఇప్పటివరకు సేకరించిన వివరాలన్ని థర్డ్ పార్టీకి ఇవ్వద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది.
 
కొత్త రెవెన్యూ చట్టం కేవలం రైతు సాగు భూముల కోసమేనని తెలిపింది. అయితే ఏ చట్టం ఆధారంగా ఆధార్, కులం వివరాలను సేకరిస్తున్నారని ప్రశ్నించింది. వ్యవసాయేతర ఆస్తుల వివరాల కోసం ఎలాంటి డేటాను భద్రతాపరంగా తీసుకుంటున్నారో తెలపాలని కోరింది. ఈ మేరకు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments