Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వల్లనే విజయశాంతి పార్టీ ప్రచారానికి దూరం: పీసీసీ చీఫ్

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (06:09 IST)
కరోనా కారణంగానే విజయశాంతి ప్రచారానికి దూరంగా ఉన్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. విజయశాంతితో మాట్లాడానని, ఆమెకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని మీడియాలో పిచ్చిరాతలు రాస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

విజయశాంతి బీజేపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోన్న వేళ... ఆమెను వెనక్కు పిలిపించుకునేందుకు టీపీసీసీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఆమె కాంగ్రెస్ కార్యక్రమాలకు  దూరంగా ఉంటున్నారు.

అంతేకాదు ఇటీవల ఆమెతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి కొద్ది రోజుల కిందట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో విజయశాంతిని బుజ్జగించేందుకు టీపీసీసీ ప్రయత్నిస్తోంది. విజయశాంతి ఇంటికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ వెళ్లారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి, మర్యాదపూర్వకంగా కలిశారు. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments