Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ బిర్యానీ పెడుతున్నారని అమిత్ షాకు కుళ్లెందుకు?: ఓవైసీ

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (18:29 IST)
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ సెటైర్లు విసిరారు. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ముస్లింలకు బిర్యానీ పంపిస్తున్నారని అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు అసదుద్ధీన్ కౌంటరిచ్చారు. ఇతరులు బిర్యానీ తింటుంటే.. ఎందుకంత కడుపు మంటా? అంటూ నిలదీశారు. 
 
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారనే విషయాన్ని గుర్తు చేసిన ఓవైసీ.. ఆ ఫంక్షన్‌లో ఏం పెట్టారా తెలియదా అంటూ ప్రశ్నించారు. అమిత్ షా బిర్యానీ ఇష్టపడతారని తనకు తెలియదన్నారు. 
 
ఒకవేళ తెలిసివుంటే అప్పుడే కళ్యాణీ బిర్యానీ పంపించమని కేసీఆర్‌కు చెప్పేవాడినని ఓవైసీ అన్నారు. కేసీఆర్ బిర్యానీ పెట్టలేదని అమిత్ షా కుళ్లుకుంటున్నారని.. ఈసారి కచ్చితంగా అమిత్ షాకు కళ్యాణీ బిర్యానీ పార్సిల్ పంపిస్తామని ఓవైసీ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments