Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడారం మహాజాతరకు హెలికాప్టర్‌ సేవలు.. ఎక్కడ నుంచో తెలుసా?

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (13:04 IST)
తెలంగాణలో మేడారం జాతర ఈ నెల 16న ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హన్మకొండ నుంచి మేడారం వరకు హెలికాప్టర్‌ నడిపించేందుకు టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది. 
 
ఆదివారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్‌ సంస్థ హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్‌ కాలేజీ నుంచి మేడారం జాతరకు భక్తులను తరలించేందుకు హెలిప్యాడ్‌ సిద్ధం చేసింది. ఇందుకోసం ఒక్కోక్కరికి 20వేల రూపాయలు చార్జీగా నిర్ణయించారు. అటు ఆర్టీసీ 3 వేల 850 బస్సుల ద్వారా 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు చేపట్టింది. 
 
ఈ ఏడాది జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. జాతరకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు రావొద్దని.. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలని  సీఎస్‌, డీజీపీ ఆదేశించారు. 
 
తాత్కాలికంగా ఆస్పత్రిని నిర్మించామని, 35 హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. స్నాన ఘట్టాల ఏర్పాటుతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా, నీరు కాలుష్యం కాకుండా నిరంతరం క్లోరినేషన్ చేయనున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం