Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కోసం డిపాజిట్​ చేస్తే పాలసీలు చేశాడు

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (17:34 IST)
ఎల్ఐసీలో ఫిక్స్డ్​ డిపాజిట్​ చేస్తానంటూ ఓ ఏజెంట్​ ఎల్​ఐసీ ఖాతాదారులను మోసం చేశాడు. రూ.85వేలను తమకు తెలియకుండానే నాలుగు పాలసీలుగా విభజించాడు.

భద్రాచలంలో జరిగిన ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ బాధితుల కుటుంబం ఆందోళన చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ఓ బాధిత కుటుంబం ధర్నా చేసింది.

జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన ముస్తఫా 2010లో ఓ ఎల్​ఐసీ ఏజెంట్​ వద్ద రూ.85వేలు ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసేందుకు నిర్ణయించుకుని డబ్బు అప్పజెప్పాడు. కానీ ఆ ఏజెంట్ ఫిక్స్​డ్​ డిపాజిట్ చేయకుండా 4 పాలసీలుగా విభజించి మోసం చేశాడని బాధితులు ఆరోపించారు.

తమ కూతురు పెళ్లి కోసమని కష్టపడి సంపాదించిన ధనాన్ని 2010లో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయగా.. వాటిని పాలసీలుగా విభజించారని వాపోయారు. తమకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరమించబోమని తెలిపారు. వారికి జరిగిన అన్యాయాన్ని స్థానిక ఎల్ఐసీ కార్యాలయంలోని మేనేజర్​తో చర్చించారు.

తమకు న్యాయం చేయాలని... కట్టిన డబ్బులకు వడ్డీ రాకపోయినా అసలు డబ్బులు ఇప్పించాలంటూ కుటుంబ సభ్యులు ధర్నా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments