Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ భవన్‌లో డీఎస్, కేకే, బొత్స ఫోటోలను పీకి చెత్తబుట్టలో వేసిన వీహెచ్

Webdunia
శనివారం, 4 జులై 2015 (14:59 IST)
హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో ఉన్న పీసీసీ మాజీ చీఫ్‌లు డి.శ్రీనివాస్, కె కేశవరావు, బొత్స సత్యనారాయణ ఫోటోలను టీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఆదివారం పీకిపారేశారు.
 
ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. వీరిలో కేకే తెరాసలో చేరి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అలాగే, డి శ్రీనివాస్ నేడోరేపో తెరాసలో చేరనున్నారు. ఇక బొత్స సత్యనారాయణ కూడా ఇటీవల వైకాపాలో చేరిన విషయంతెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం గాంధీభవన్‌కు వచ్చిన వీహెచ్, దామోదర్ రెడ్డి ఆ ముగ్గురి ఫోటోలను తొలగించి చెత్తబుట్టలో పడేశారు. పార్టీ మారిన వారి చిత్రాలు గాంధీభవన్‌లో ఉండటం మంచిది కాదని, వారంతా తమ స్వలాభం కోసం పార్టీ మారారని వీహెచ్, దామోదర్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటివారి ఫోటోలు గాంధీ భవన్‌లో ఉండటానికీ వీలులేదని వారు తేల్చిచెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments