Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతగూటికి చేరిన ధర్మపురి శ్రీనివాస్... మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు..

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (14:30 IST)
ధర్మపురి శ్రీనివాస్.. ఒకపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. పీసీసీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పని చేశారు. ముఖ్యంగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆయన ఉమ్మడి ఏపీతో పాటు కాంగ్రెస్ పార్టీని శాసించారు. డీఎస్‌ గతంలో కాంగ్రెస్‌లో కీలక పదవులు నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో పార్టీ 2004, 2009లో అధికారంలో ఉన్నప్పుడు డీఎస్‌ మంత్రిగా సేవలందించారు.
 
రాష్ట్ర విభజన తర్వాత 2015లో భారాసలో చేరిన డీఎస్‌.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆ పార్టీలో ఆయనకు సరైన ఆదరణ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో డీఎస్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. 
 
డీఎస్‌తో పాటు ఆయన తనయుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments