Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేటర్ హైదరాబాదులో కరోనా పంజా.. 50 లక్షల మందికి జలుబు, జ్వరం

Webdunia
మంగళవారం, 18 మే 2021 (11:49 IST)
కరోనా తెలంగాణలో విజృంభిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదులో కోవిడ్ పంజా విసురుతోంది. ఇంకా గ్రేటర్‌ హైదరాబాద్‌లో జ్వరం సర్వే మొదలైంది. మే 16నాటికి 8.5 లక్షల ఇళ్ళ పరిశీలన పూర్తయ్యింది. నిత్యం సుమారు 1700 బృందాలు సర్వే చేస్తున్నాయి. ప్రతి 100 ఇళ్ళల్లో పది మందికి పైగా జలుబు, దగ్గు వంటి లక్షణాలతో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా 50 లక్షల మంది ప్రజలు జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. 
 
క్షేత్రస్థాయిలో వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ.. జ్వరం సర్వేలో ఇప్పటికే 52 వేల మంది వ్యాధి లక్షణాలతో కనిపించడం ఆందోళనకు తావిస్తోంది. 
 
అందులో చిన్నారులు, యువత ఎక్కువగా ఉన్నారు. జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతున్నారు. అందుకు వాతావరణ మార్పులు కారణం కావొచ్చని వైద్యుల అంచనా. 
 
ముక్కు కారడం, పొడి దగ్గు, విరేచనాలతో బాధపడుతున్న వారికి యంత్రాంగం కరోనా కిట్లు అందజేస్తోంది. కట్టడి చర్యలు అమలు చేస్తోంది. నాలుగైదు రోజులకు వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టకపోతే దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానాను సంప్రదించాలని ఆశా కార్యకర్తలు బాధితులకు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments