సరసాలకు చోటులేదు.. అద్దె ఇంటి కోసం వెళ్లి..?

Webdunia
సోమవారం, 2 మే 2022 (22:40 IST)
సరసాలకు ఎక్కడా చోటు దొరక్క అద్దె కోసం ఇల్లు వెతుక్కుని మరీ శృంగారంలో మునిగిపోయారు ఆ జంట. అయితే, మధ్యలో ఓనర్‌ ఎంటర్‌ కావడంతో సీన్‌ రివర్స్‌ అయింది. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటనలో చోటుచేసుకుంది.  
 
ఈ వ్యవహారమంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ కాలనీలో అద్దె ఇంటి కోసం ఓ జంట వేట మొదలు పెట్టింది. 
 
ఈ నేపథ్యంలోనే ఓ ఇంటి ముందు టూలెట్‌ బోర్డు కనిపించడంతో యువతీ యువకులిద్దరూ ఆగారు. ఇంటి ముందు కనిపించిన ఓనర్‌తో మాట్లాడారు.. ఇల్లు అద్దెకు కావాలని అడిగారు.
 
సెకండ్‌ ఫ్లోర్‌లో ఇల్లు ఖాళీగా ఉందని ఓనర్‌ చెప్పగా.. ఓసారి చూసొస్తామని చెప్పారు. అక్కడ్నుంచి సెకండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఇంట్లోకి వెళ్లిన జంట ఎంతసేపైనా తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్లి చూశాడు. అయితే, అప్పటికే సరసాలాడుతూ ఆ జంట కనిపించింది.
 
ఓనర్‌ను చూసిన ఆ జంట అక్కడ్నుంచి పరుగులు పెట్టుకుంటూ బయటకు వెళ్లిపోయారు. ఓనర్‌ను చూసి ఆ జంట పరుగులు పెడుతున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments