వదిన, మరిది ఒకే చీరకు ఉరేసుకున్నారు.. కారణం అదే..?

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (11:59 IST)
వివాహేతర సంబంధాలు ఎందరో చావులకు కారణమవుతున్నాయి. తాజాగా వదిన, మరిది వివాహేతర సంబంధం చివరికి ఒకరి మరణానికి కారణమైంది. మరోకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. తమ బంధం గురించి అందరికీ తెలుస్తోందని వదిన, మరిది ఒకే చీరకు ఉరేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. దేవరకద్ర మండలంలోని గోపనపల్లి గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఆంజనేయులుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య అర్చన(23) తన భర్త కుటుంబంలో వరుసకు మరిది అయ్యే మధు(22)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం ఇతరులకు తెలియడంతో మనస్తాపానికి గురైన ఆ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఇద్దరూ కలిసి ఇంట్లోనే ఒకే చీరకు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గమధ్యంలోనే అర్చన మృతి చెందింది. మరోవైపు మధు పరిస్థితి విషమంగా ఉంది. దాంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments