Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్టారును మెకానిక్ చేసేసిన కరోనావైరస్, ఎన్ని జీవితాల తల రాతలను మార్చేస్తుందో?

Webdunia
గురువారం, 2 జులై 2020 (16:51 IST)
కరోనావైరస్ ఎంతోమంది జీవితాల తల రాతలను మార్చేస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఓ ప్రొఫెసర్ జీవితాన్నే మార్చివేసింది. కష్టపడి చదివాడు తన కలలు నిజం చేసుకునేందుకు. చిన్నపాటి ఉద్యోగంతో ప్రారంభించి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగాడు.
 
ప్రైవేటు కాలేజి ఉద్యోగమైనా ఇక లైఫ్ సెటిల్ అనుకున్నాడు. అంతలోనే అనుకోని విపత్తు అతని జీవితాన్ని మార్చి వేసింది. పాఠాలు చెప్పాల్సిన గురువుని కిందిస్థాయికి దిగజార్చింది. ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేసి దశాబ్ద కాలంపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన రవీందర్ జీవితం ప్రశాంతంగా సాగింది.
 
కానీ ఆ జీవితాన్ని కరోనావైరస్ తలక్రిందులు చేసింది. వైరస్ ప్రభావంతో కళాశాలలో తెరవలేదు. జీతాలు చేతికి రాక గత మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఫలితంగా తన కుటుంబం ఆర్థిక ఇబ్బందిలో పడిపోయింది. ఇక విధి లేక సొంత గ్రామానికి వెళ్లి బైక్ మెకానిక్‌గా మారాడు. ఇలా ఎంతోమంది జీవితాలను మార్చేస్తోందీ కరోనావైరస్.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments