పుణ్యం కట్టుకున్న కరోనా వైరస్ : 33 సార్లు తర్వాత టెన్త్ పాసయ్యాడు... (Video)

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (11:11 IST)
అనేకమందికి కరోనా వైరస్ చాలా మేలు చేసింది. పది, ఇంటర్, డిగ్రీలు ఉత్తీర్ణత సాధించేందుకు అనేక ఏళ్ళుగా దండయాత్రలు చేస్తున్నారు. అయినప్పటికీ తాము రాసే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోయారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పదో తరగతి పరీక్షలను 33 సార్లు రాశాడు. అయినప్పటికీ.. పాస్ కాలేదు. కానీ కరోనా వైరస్ పుణ్యమాని అతను ఎట్టకేలకు పాసయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని భోలక్ పూర్ అంజుమన్ బాలుర హైస్కూలులో జరిదింది. 
 
ఈ హైస్కూలులో వాచ్‌మన్‌గా పనిచేసే మహ్మద్ నూరుద్దీన్ ది ఓ విచిత్ర గాథ. ఇప్పటివరకు 33 సార్లు పదో తరగతి పరీక్షలు రాసినా పాస్ కాలేదు కానీ, కరోనా పుణ్యమా అని ఎట్టకేలకు పాసయ్యాడు. కరోనా ప్రభావంతో పది పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం అందరినీ పాస్ చేయడంతో మహ్మద్ నూరుద్దీన్ కూడా గట్టెక్కాడు. 
 
నూరుద్దీన్ తొలిసారిగా 1987లో ప్రైవేట్‌గా టెన్త్ పరీక్షలు రాశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిసారీ అపజయమే. ఇటీవలే టెన్త్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఫీజు కట్టాడు. కరోనా చలవతో పరీక్షలేమీ లేకపోవడంతో అందరిలాగే నూరుద్దీన్‌ను కూడా పాస్ చేశారు. 
 
దీనిపై నూరుద్దీన్ మాట్లాడుతూ, ఇన్నాళ్లు ఎక్కువగా ఇంగ్లీష్ సబ్జెక్టులోనే ఫెయిల్ అయ్యేవాడ్నని, ప్రభుత్వ ఉద్యోగం కోసమే తాను పది పరీక్షలు రాస్తున్నానని తెలిపారు. అన్నట్టు... నూరుద్దీన్‌కు ఇంటర్ చదివిన ఇద్దరు కుమారులతో పాటు బీకాం ఉత్తీర్ణురాలైన ఓ కుమార్తె ఉంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments