Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 31 మంది వైద్యులకు కరోనా! అధికారుల్లో గుబులు!!

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (13:38 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇక్కడ కేసులు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో ప్రతి రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, కరోనా వైరస్ బారినపడిన వారికి చికిత్స చేసేందుకు వైద్యులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి చికిత్స చేస్తున్నారు. కరోనాపై దేశం సాగిస్తున్న పోరులో వైద్యులో ముందు వరుసలో ఉన్నారు. 
 
ఈ క్రమంలో కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్న డాక్టర్లకు కూడా వైరస్ సోకుతోంది. ఆ విధంగా తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న 31 మంది డాక్టర్లకు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్స్‌కు వైరస్ సోకడంతో, అధికారులు పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
 
వీరికి వైరస్ సోకిందని బుధవారం నిర్ధారణ కావడంతో, రాష్ట్ర వైద్య వర్గాలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యాయి. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులే వైరస్‌కు హాట్ స్పాట్స్‌గా మారుతున్నాయన్న ఆందోళన పెరిగిపోతున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ, ఈ సమావేశం నిర్వహించి, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.
 
మరోవైపు, తాజాగా వైరస్ సోకిన డాక్టర్లు గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నిమ్స్, పెట్లబుర్జ్ ఆసుపత్రికి చెందిన వారని అధికారులు వెల్లడించారు. నిమ్స్ కార్డియాలజీ విభాగంలోని నలుగురు పీజీ రెసిడెంట్స్, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్స్, పెట్లబుర్జు ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగానికి చెందిన ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు, ఓ ప్రొఫెసర్‌కు వైరస్ సోకింది. 
 
ఉస్మానియాలో అనస్థీషియా విభాగంలో పని చేస్తున్న పీజీ డాక్టర్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ఇద్దరు పీజీ రెసిడెంట్స్, నలుగురు హౌస్ సర్జన్లకు వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన హెల్త్ వర్కర్లు, జూనియర్ డాక్టర్ల బృందం తెలంగాణ వైద్య మంత్రి ఈటల రాజేందర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌లను కలిసి, తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments