తెలంగాణకు కరోనా ఊరట

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (21:14 IST)
కరోనా మహమ్మారి నుంచి తెలంగాణకు బుధవారం కాస్త ఊరట లభించింది. గత మూడు రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే.. ఈ సంఖ్య బుధవారం అనూహ్యంగా తగ్గడం కాస్త ఊరట కలిగించే విషయం. బుధవారం కొత్తగా తెలంగాణలో 15 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో రాష్ట్రంలో కేసులు సంఖ్య 943కి చేరింది. కరోనాతో బుధవారం ఒకరు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 24కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 10, సూర్యాపేటలో 3, గద్వాలలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 725గా ప్రకటించింది. ఇప్పటివరకూ 194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయనట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత బుధవారం కేవలం ఆరు కేసులే నమోదయ్యాయి.

ఈ బుధవారం 15 కేసులు నమోదు కావడం గమనార్హం. వారం వ్యవధిలో నమోదైన కేసులను పరిశీలిస్తే మళ్లీ ఈ బుధవారమే ఇంత కనిష్టంగా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments