Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మం జిల్లాలో ఒక్కరి నుంచి 8మందికి కరోనా

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (09:36 IST)
ఖమ్మం జిల్లాలో సోమవారం ఒక్క రోజే 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రం ఎన్‌ఎస్‌టీ రోడ్డుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా వైరస్‌ సోకడంతో ప్రస్తుతం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సదరు వ్యక్తి కుటుంబీకులు, కాంటాక్ట్‌ వ్యక్తులు 20 మంది నుంచి ఆదివారం నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో వారిలో 8 మందికి వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో నిర్ధారించారు.

అలాగే తల్లాడ మండలం వెంకటగిరికి చెందిన చిన్నారి, ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన యువకుడు కొవిడ్‌-19 లక్షణాలతో ఆస్పత్రికి రాగా పరీక్షలు నిర్వహించారు.

వారికి కూడా వైరస్‌ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ బాధితులందరినీ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇక సత్తుపల్లి పట్టణ కేంద్రానికి చెందిన క్యాన్సర్‌ బాధితుడు హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటూ కరోనా బారిన పడ్డారు.

వీరితో పాటు పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో మరో మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో ఒకే రోజు 12 కేసులు వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments