Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రాసలీలలు...

హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు రాసలీలలకు దిగారు. ఈ విషయాన్ని గమనించిన రోగులు... గది తలుపులకు తాళం వేసి రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టించారు. తాజాగా వెలుగు చూసిన ఈ వివర

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (10:33 IST)
హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు రాసలీలలకు దిగారు. ఈ విషయాన్ని గమనించిన రోగులు... గది తలుపులకు తాళం వేసి రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టించారు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ ఆస్పత్రిలో సెక్యూరిటీ సూపర్ వైజర్ రాంకిలాన్ పాండే అనే వ్యక్తి పని చేస్తున్నారు. అలాగే, ఓ మహిళ కాంట్రాక్టు ఉద్యోగినిగా పని చేస్తోంది. వీరిద్దరూ కలిసి రోగులకు కేటాయించే ఓ గదిలో రాసలీలలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులు గమనించారు. 
 
ఈ క్రమంలో వారిద్దరు గదిలో ఏకాంతంగా ఉండటాన్ని గమనించిన కొందరు బయట గడియ పెట్టి అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు తెరిపిస్తే, గదిలో పాండేతో పాటు మరో కాంట్రాక్టు ఉద్యోగిని ఉండటంతో ఇద్దరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. తనను విధుల నుంచి తొలగిస్తానని పాండే బెదిరించగా, భయంతో లొంగిపోయినట్టు సదరు ఉద్యోగిని వెల్లడించడం గమనార్హం. 
 
ఈ ఆస్పత్రిలో శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, పేషెంట్ కేర్ విభాగాల్లో పని చేసేందుకు పలువురిని కాంట్రాక్టు పద్ధతిలో ఎంపిక చేస్తుంటారు. వీరిలో కొందరు ఆసుపత్రి సెల్లార్‌లోని గదులు, ఖాళీగా ఉండే గదుల్లో ఉంటూ ఇటువంటి అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments