Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌తో దానం భేటీ.. రక్తపు కూడు తినననీ.. ఏ పాపం చేయనని కామెంట్

తెలంగాణ సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్‌ను కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌‌ కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దాదాపు 20 నిమిషాల పాటు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటి స్నేహపూర్వకంగా జ

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (08:52 IST)
తెలంగాణ సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్‌ను కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌‌ కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దాదాపు 20 నిమిషాల పాటు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటి స్నేహపూర్వకంగా జరిగిందని, ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని దానం చెప్పారు.
 
నయీమ్ దందాల వెనుక గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతగా ఉన్న దానం నాగేందర్ హస్తం కూడా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంది. నయీమ్ ఫామ్ హౌస్ పక్కనే దానం ఫామ్ హౌస్ కూడా ఉండటం, పలు సెటిల్ మెంట్లకు దానం నాగేందర్ సహకరించాడని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటి టాక్ అఫ్ ది టౌన్‌గా మారింది.
 
అయితే దానం నాగేందర్‌ కేవలం బంధువులకు చెందిన ఓ కంపెనీ విషయం మాట్లాడేందుకు వెళ్లినట్లు సమాచారం. తాను పార్టీ మారే విషయంలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారాలపై ఆయన స్పందిస్తూ తాను రక్తపుకూడు తినననీ, ఏ పాపం చేయనన్నారు. ఎలాంటి ప్రచారాలకు తాను భయపడే సమస్యేలేదన్నారు. తనకో వ్యక్తిత్వం ఉందనీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేవరకు పోరాడుతానని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments