Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బిడ్డ పబ్‌కు వెళ్లలేదు.. బర్త్‌డే పార్టీకి వెళ్ళాడు - అంజన్ కుమార్ యాదవ్

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (15:42 IST)
హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా నక్షత్ర హోటల్‌లోని పబ్‌లో ఆదివారం వేకువజామున జూబ్లీహిల్స్ పోలీసులు దాడి చేసి దాదాపు 140 మందికిపై సెలెబ్రిటీలు, ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఇది పెను సంచలనంగా మారింది. వీరిలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ నిహారిక కొణిదెల, తెలంగాణ మాజీ డీజీపీ కుమార్తె, కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు ఇలా అనేక మంది ప్రముఖులు, సినీ సెలెబ్రిటీల పిల్లలు ఉన్నారు. ఈ విషయం వెలుగులోకి రాగానే ఈ పబ్‌లో సోదాలు చేసిన జూబ్లీహిల్స్ సీఐ శివచంద్రుపై సస్పెన్షన్ వేటు పడగా, ఏసీపీకి చార్జ్‌మెమో ఇచ్చారు. 
 
అయితే, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీ స్పందించారు. తన బిడ్డ పబ్‌కు వెళ్లలేదని, బర్త్‌డే పార్టీకి వెళ్ళాడని వివరించారు. బర్త్‌డే పార్టీకి వెళితే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
అంతేకాకుండా అనేక స్టార్ హోటళ్ళలో పబ్బులు ఉన్నాయని, పుట్టిన రోజు వేడుకల కోసం ఈ హోటళ్ళకు వెళితే పబ్బులపై దాడుల సందర్భంగా బర్త్ డే వేడుకలకు వెళ్లిన వారిని కూడా అదుపులోకి తీసుకెళుతున్నారని చెప్పారు. 
 
రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేని కొందరు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ కుటుంబానికి ఇప్పటివరకు ఎలాంటి చెడ్డపేరు లేదని అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలోని పబ్బులను మూసివేసి, మద్య నిషేధం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments