Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్య‌ప్రాణుల చిత్రాల‌తో రాజ్‌భ‌వ‌న్ ప్ర‌ధాన‌ ర‌హ‌దారికి స‌రికొత్త శోభ‌

హైదరాబాద్, సోమాజిగూడ రాజ్‌భ‌వ‌న్ ఎదురుగా గ‌ల ఎంఎస్ మ‌క్తా ప్ర‌ధాన ర‌హ‌దారి గోడ‌లు ఇపుడు అంద‌మైన పెయింటింగ్‌ల‌తో స‌రికొత్త శోభ‌ను సంత‌రించుకున్నాయి. నిన్న‌టిదాక మాసిపోయి ఉన్న ఈ గోడ‌లు నేడు ప‌లు ర‌కాల వ

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (18:30 IST)
హైదరాబాద్, సోమాజిగూడ రాజ్‌భ‌వ‌న్ ఎదురుగా గ‌ల ఎంఎస్ మ‌క్తా ప్ర‌ధాన ర‌హ‌దారి గోడ‌లు ఇపుడు అంద‌మైన పెయింటింగ్‌ల‌తో స‌రికొత్త శోభ‌ను సంత‌రించుకున్నాయి. నిన్న‌టిదాక మాసిపోయి ఉన్న ఈ గోడ‌లు నేడు ప‌లు ర‌కాల వ‌న్య‌ప్రాణులు, జీవ‌వైవిద్య చిత్రాల‌తో ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. పై అంద‌మైన పెయింటింగ్‌లు వేసే ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన వీధుల‌కు క‌ళాత్మ‌క సొబ‌గులు అద్దేందుకు జీహెచ్ఎంసీ చేప‌ట్టిన పెయింటింగ్‌ల‌లో భాగంగా సోమాజిగూడ ఎంఎస్ మ‌క్తా ప్ర‌హ‌రీగోడ‌పై జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ‌విద్యాల‌యం ఫైన్ ఆర్ట్స్ విభాగంచే తెలంగాణలోని ప‌లు అట‌వీ వ‌న్య‌ప్రాణులు, జీవ‌వైద్యాన్ని ప్ర‌తిభింబించే అనేక చిత్రాల‌ను పెయింటింగ్ చేయించ‌డం న‌గ‌ర‌వాసుల‌ను ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది. దీంతో పాటు ఇటీవ‌ల న‌క్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో న‌వంబ‌ర్ 1 నుండి 24వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివ‌ల్‌లో భాగంగా న‌క్లెస్‌రోడ్ వెంట ఉన్న గోడ‌ల‌పై, భ‌వ‌నాల‌పై ఆధునిక, చారిత్ర‌క‌ చిత్రాలను పెయింటింగ్ చేయ‌డంలో జీహెచ్ఎంసి స‌హ‌క‌రించింది. 
 
సోమాజిగూడ ఫ్లైఓవ‌ర్‌, పీపుల్స్ ప్లాజా, ఎంఎస్ మ‌క్తా వైపు ఉన్న ప్ర‌హ‌రీగోడ‌లు, భారీ భ‌వ‌నాల‌పై వేసిన చిత్రాలు రాష్ట్రంలోని ప‌లువురు ప్ర‌ముఖుల‌తో పాటు న‌గ‌రవాసుల‌ను విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో రాజ్‌భ‌వ‌న్ మార్గంలో ఈ చిత్రాల‌ను వేసే ప్ర‌క్రియ‌ను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. సోమాజిగూడ ఫ్లైఓవ‌ర్‌పై గ్రామీణా వాతావ‌ర‌ణం తెలియ‌జేసే పెయింటింగ్‌లు, న‌క్లెస్‌రోడ్ స‌మీపంలో ఆధునిక జీవ‌నాన్ని ప్ర‌తిబింభించే పెయింటింగ్‌ల‌ను వేయ‌గా రాజ్‌భ‌వ‌న్ ఎదురుగా పూర్తిగా వ‌న్య‌ప్రాణుల పెయింటింగ్‌ల‌ను జీహెచ్ఎంసి వేయిస్తోంది. 
 
ఇందుకుగాను జె.ఎన్‌.టి.యు ఫైన్ఆర్ట్స్ పెయింటింగ్ విభాగం విద్యార్థినీ విద్యార్థుల‌తో వేయిస్తున్నారు. గ‌త రెండు వారాలుగా వేస్తున్న ఈ పెయింటింగ్‌లు మ‌రికొద్ది రోజుల్లో పూర్తి కానున్నాయి. అనంత‌రం సోమాజిగూడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ప్ర‌హ‌రీగోడ‌తో పాటు అదే మార్గంలో ఉన్న ప్ర‌ధాన ప్ర‌భుత్వ భ‌వ‌నాల ప్ర‌హ‌రీగోడ‌ల‌పై కూడా పెయింటింగ్‌లు వేయించ‌డం ద్వారా న‌గ‌ర ప్ర‌ధాన రోడ్ల‌కు మ‌రింత శోభ‌ను క‌ల్పించ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్ధన్‌ రెడ్డి తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

3 సెకన్ల క్లిప్ కోసం రూ. 10 కోట్ల కాపీరైట్ కేసు వేశావంటే? ధనుష్‌పై నయన ఫైర్

నాగచైతన్య కోసం శోభిత అదంతా చేస్తుందా?

కొత్తవారితో ద్విభాషా చిత్రంగా మహా సంద్రం పూజతో ప్రారంభం

స్లమ్ లో ధనుష్, బిజినెస్ మేన్ నాగార్జున, మద్యతరగతి అమ్మాయి రష్మిక కథే కుబేర

కళ్యాణ్ బాబు ధైర్యం అంటే ఇష్టం - నాకు పోటీ ఎవరూ లేరు నేనే : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments