Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (12:42 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఇందులో ప్రధానంగా వరి ధాన్య సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఇందులో మంత్రులతో చర్చించి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.
 
ప్రధానంగా రైతుల నుంచి వరి కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునఃప్రారంభించబోతోందని సమాచారం. సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ మంత్రివర్గంతో చర్చిస్తారని చెబుతున్నారు. అంతకుముందు ఢిల్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం విఫలమైతే రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి కొనుగోలు చేస్తుందన్నారు.


కేంద్రానికి డెడ్‌లైన్...
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి సవాలు విసిరారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని.. లేకుంటే కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని కేసీఆర్ అన్నారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్దంగా ఉన్నారని... రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు.  
 
కాగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు సీఎం కేసీఆర్, రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..  తెలంగాణ నుంచి ఇంత దూరం వచ్చి దీక్ష చేయడానికి కారణమెవరని కేసీఆర్ ప్రశ్నించారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చని.. కానీ రైతులతో పడొద్దని అన్నారు. కేంద్రాన్ని గద్దె దించే సత్తా రైతులకు ఉందన్నారు. 
 
రైతుల్ని కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఉరికేపోదని అన్నారు. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని అన్నారు. 
 
కేంద్ర మంత్రి తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరమైనవని కేసీఆర్ అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలు నూకలు తినాలని చెప్పారని.. తాము మేము పీయూష్ గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా..? అని ప్రశ్నించారు. పీయూష్ గోయల్ ఉల్టా పల్టా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీయూల్ గోయల్ కాదు.. పీయూల్ గోల్ మాల్ అని విమర్శించారు.  
 
దేశంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేసీఆర్ అన్నారు. ప్రధాన మంత్రి మోదీ సొంత రాష్ట్రంలో కూడా విద్యుత్ కోసం రైతులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం