Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్డౌన్ విధించం : సీఎం కేసీఆర్ స్పష్టీకరణ

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (14:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్డౌన్ విధిస్తారని, లేకపోతే కనీసం వారాంతంలోనైనా అన్నీ మూసేస్తారనే వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. 
 
ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్డౌన్ విధించబోమన్నారు. టాలీవుడ్‌కు చెందిన కొందరు సినీ ప్రముఖులు లాక్డౌన్ నిర్ణయం తీసుకుంటున్నారా అని తనను అడిగారని, అయితే అలాంటి నిర్ణయం ఏదీ లేదని వారికి వివరించానని కేసీఆర్ తెలిపారు.
 
"కొందరు సినీ ప్రముఖులు నన్ను కలిశారు. ఇప్పటికే పలు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయని, పెట్టుబడులు పెట్టామని ఆ సినీ ప్రముఖులు వివరించారు. గతంలో విధించిన లాక్డౌన్ తో బాగా నష్టపోయాం... మరోసారి లాక్డౌన్ దిశగా చర్యలు లేవని వారికి స్పష్టంచేశాను. 
 
అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగానే విద్యాసంస్థలను మూసివేశాం. విద్యాసంస్థలను మూసివేయాల్సి రావడం బాధ కలిగిస్తున్నా, తప్పలేదు" అని పేర్కొన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments