తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో పిఆర్వో విజయ్ కుమార్ పైన వేటు పడింది. పీఆర్వో అయిన తర్వాత ఆయన సంపాదించిన ఆస్తులపై ఇంటిలిజెన్స్ శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఒక నివేదిక సమర్పించింది.
దీని ఆధారంగా చేసుకొని వెంటనే పిఆర్ఓని తొలగించవలసిందిగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ శాఖలో ఉన్న జనరల్ మేనేజర్ పదవి నుంచి తొలగించడం జరిగింది. విజయ్ కుమార్‌ను తొలగించడంలో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది.