Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడి.. 5న పాలమూరు జిల్లా బంద్ : టీ కాంగ్రెస్ పిలుపు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (20:10 IST)
మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిపై చేయిచేసుకున్నారు. ఈ దాడికి నిరసనగా టీ కాంగ్రెస్ శనివారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, రామ్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని కూడా ఆయన ఖండించారు. 
 
వాస్తవానికి జెడ్పీ సమావేశం కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డిలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిల మధ్య వాదులాట జరిగింది. 
 
ఈ క్రమంలో జరిగిన తోపులాటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుకు గాయాలయ్యాయి. దీంతో, తనపై దాడి చేసిన చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలని బాలరాజు డిమాండ్ చేశారు. పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో, గొడవ పెరగకుండా ఇద్దరికీ పోలీసులు నచ్చజెప్పారు. 
 
కాగా, జిల్లా పరిషత్ సమావేశం సందర్భంగా రామ్మోహన్ రెడ్డిపై దాడి చేసిన అనంతరం అతనిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని బాలరాజు డిమాండ్ చేసిన సంగతితెలిసిందే. దళితుడైనందుకే తనపై రామ్మోహన్ రెడ్డి చేయి చేసుకున్నారని బాలరాజు ఆరోపిస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments