ప్రధానిని చూసి కేసీఆర్ భయపడుతున్నారు.. ఖుష్బూ

Webdunia
శనివారం, 2 జులై 2022 (21:41 IST)
ప్రధాని నరేంద్ర మోదీని చూసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ భయపడుతున్నారని బీజేపీ నేత, నటి ఖుష్బూ చెప్పుకొచ్చారు. హైదరాబాదు నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఖుష్బు హాజరయ్యారు. 
 
మోదీజీ వెనక్కి పోవాలంటూ హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్స్‌ పెట్టారని.. వీటిని చూస్తుంటే టీఆర్ఎస్ భయపడుతున్నట్లు తెలుస్తోందన్నారు. 
 
మూడోసారి ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్‌ వెళ్లలేదని విమర్శించారు. కేసీఆర్‌ ఆలోచనా విధానం ఎలా ఉందనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందని కుష్బూ అన్నారు. 
 
వారసత్వ రాజకీయాలను సహించేది లేదని ఖుష్బూ చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అది ప్రజలే చూస్తారని ఖుష్బు స్పష్టం చేశారు.
 
భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరిన ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్నారు. 
 
షెడ్యూల్‌ కంటే మోదీ 10 నిమిషాలు ఆలస్యంగా మోదీ హైదరాబాద్‌కు వచ్చారు. హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశ స్థలిలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'రాజాసాబ్' విజయం సాధించకూడదని కొందరు కోరుకుంటున్నారు : మారుతి

మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిని : హీరో నవీన్ పోలిశెట్టి

శివాజీ గారు అలా మాట్లాడితే విజిల్స్, చప్పట్లు కొట్టారు, వాళ్లనేం చేయాలి?: నవదీప్ ప్రశ్న

Spirit update: ప్రభాస్ నూతన చిత్రం స్పిరిట్ నుంచి కొత్త పోస్టర్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జైత్రరామమూవీస్ బేనర్ లో కొత్త ఏడాది సినిమా ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు

మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం

అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?

కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025లో కీలక విషయాలు

తర్వాతి కథనం
Show comments