Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతికుండగానే పాడి గేదెల తొడలు కోసిన క్రూరుడు!

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (09:28 IST)
తెలంగాణాలోని సిద్ధిపేట జిల్లా కొండపాక మండలోని సిరిసినగండ్ల శివారులో దారుణం జరిగింది. కొందరు యువకులు బతికి ఉండగానే పాడి గేదెల తొడలు కోసి మాంసం తీసుకెళ్లారు. నలుగురు నిందితుల్లో ఒకరు నేపాల్ యువకుడు కాగా, మిగతా ముగ్గురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిరిసినగండ్ల - దమ్మకపల్లి గ్రామాల మధ్య రాజేందర్‌ రెడ్డి అనే రైతుకు ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నేపాల్ చెందిన యువకుడితో పాటు ఏపీకి చెందిన మరో ముగ్గురు యువకులు పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రాజగిరి వెంకటేశం అనే రైతు తన పాకలోని గేదెల నుంచి పాలు పిండుకుని వెళ్లిపోయాడు.
 
రాత్రివేళ ఆ పాకలో దూరిన నలుగురు నిందితులు మాంసం కోసం రెండు గేదెల తొడలు కోశారు. దీంతో విలవిల్లాడిన గేదెలు రక్తస్రావమై చనిపోయాయి. ఉదయం పొలానికి వచ్చిన రైతు చనిపోయిన గేదెలను చూసి విస్తుపోయాడు. 
 
విషయం గ్రామస్థులకు చెప్పి నిందితుల కోసం గాలించగా వారంతా వ్యవసాయ క్షేత్రంలో మాంసం వండుతూ కనిపించారు. గ్రామస్థులను చూసి నిందితుల్లో ముగ్గురు పరారు కాగా, నేపాలీ యువకుడు సందీప్ (25) వారికి పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments