Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో విషాదం: రోలింగ్ షట్టర్‌లో చిక్కుకొని బాలుడు మృతి

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (13:38 IST)
హైదరాబాద్‌లో విషాదం నెలకొంది. రోలింగ్ షట్టర్‌లో చిక్కుకొని బాలుడు మరణించాడు. గచ్చి బౌలిలోని ఓ బైక్ షోరూమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అర్జున్ గచ్చిబౌలిలోని టీవీఎస్ షోరూమ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. 
 
ఎప్పటిలాగే బుధవారం ఉదయం కూడా యథావిధిగా షట్టర్ తెరిచారు. ఐతే ఆ సమయంలో అర్జున్ కుమారుడు రాజేష్ అక్కడే ఉన్నారు. ప్రమాదవశాత్తు ఆటో మేటిక్ షట్టర్‌కు చుట్టుకొని చిక్కుకుపోయాడు. 
 
గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు షట్టర్‌ను కిందకు దించారు. అందులో ఇరుక్కుపోయిన రాజేష్‌ను బయటకు తీశారు. ఐతే అప్పటికే తీవ్రంగా గాయపడడంతో రాజేష్ అక్కడికక్కడే మరణించాడు. షోరూమ్ నిర్వాహకులే ఘటనకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
 
గతంలో వాచ్‌మెన్ కుమార్తెకు కూడా విద్యుత్ షాక్ తగిలిందని స్థానికులలు తెలిపారు. ఆ ఘటనలో ఆమె సురక్షితంగా బయపటడినట్లు వెల్లడించారు. ఇప్పుడు రోలింగ్ షట్టర్‌లో ఇరుక్కొని కుమారుడు మరణించినట్లు చెప్పారు. రాజేష్ మృతితో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. 
 
తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడి మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు షోరూమ్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments