Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎమ్మెల్యే షకీల్‌పై బిగిస్తున్న ఉచ్చు.. త్వరలో అరెస్టు?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (13:56 IST)
తెలంగాణలో పూర్తి స్థాయిలో పాగా వేసేందుకు భాజపా వ్యూహాత్మక ఎత్తుగడలకు పదును పెడుతోంది. అందుకు అనుగుణంగా తెరాస నేతలపై ఉన్న కేసుల దొంతరలను ఒకొక్కటిగా తొలగిస్తోంది. ఇందులో భాగంగా ఎవరి చిట్టాలను విడివిడిగా పరిశీలిస్తోంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ అమిర్ సంబంధించిన పాత కేసుల మూలాలకు వెళుతున్నట్లు తెలిసింది.
 
ఇదీ ప్రస్థానం:
అతను..చిన్నా చితక నేరాలు చేసే రకం కాదు. 2005లోనే.. 29 ఏళ్ళకే .. నేర ప్రస్థానం ప్రారంభించారు. మళ్ళీ 2007లో ఢిల్లీ విమానాశ్రయంలో మరో కేసు. అదే విమానాశ్రయంలో.. 2013లో తీవ్రమైన నేరంలో పట్టుబడ్డారు. అన్ని నేరాలలో 420, 471 ఉండగా... రెండు కేసులలో 120బి (కుట్రకు పాల్పడ్డారని వివరించే సెక్షన్) కూడా ఉంది. హఠాత్తుగా రాజకీయాలు మారాయి. రౌడీలు.. దోపిడిదారులు, నేరగాళ్ళు రాజకీయులుగా మారారు. ఇతగాడూ మారాడు. రాజకీయ అవతారం ఎత్తాడు. అందులో వింతేముంది. ఉన్నదల్లా ... ఇంత తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆయన చుట్టూ నిత్యం తిరిగే అధికారగణం. 
 
తెరాస పార్టీ టికెట్ ఇచ్చింది ఏకంగా ఎమ్మెల్యే అయ్యాడు. అనంతరం తెలంగాణ లెజిస్లేచర్ మైనార్టీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కూడా కాగలిగారు. రెండోసారి కూడా ఎమ్మెల్యే అయ్యాడు. ఇసుక దందా నుంచి విమానాశ్రయాలకు ఎదిగిన ఈయన బోధన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 
ఇదీ నేర చరిత్ర:
కేంద్ర హోంశాఖ షకీల్ కేసులపై తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. వారు తెప్పించుకున్న కేసులలో ఈ కేసులు ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్‌లో సెక్షన్లు 420, 471తో కూడిన ఎఫ్ఐఆర్ నెంబర్ 11/2005. 
మరో రెండేళ్ళకు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్షన్లు 419, 420, 468,471,120-బి లతో కూడిన ఎఫ్ఐఆర్ నెంబర్ 168/2007. మరో ఐదేళ్ళకు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్షన్లు 409, 419, 420, 468, 471, 201, 120-బి లతో కూడిన ఎఫ్ఐఆర్ నెంబర్ 20/2013.
 
అఫిడవిట్‌లో అలా..: 
షకీల్ తన ఎన్నికల అఫిడవిట్ లో తనకు 'నాట్ అప్లికబుల్' అంటూ 27 సార్లు చెప్పారు. అతను లేనిదే పార్టీ ఆఫీసులు ప్రారంభం అయ్యే పరిస్థితి లేదు. ప్రతి కార్యక్రమం ఆయన లేనిదే నడవని పరిస్థితి నెలకొంది.
 
లింకేమిటి..:
మనుషుల అక్రమ రవాణా కేసులో తెరాస కీలక నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. షకీల్ అమీర్ కూడా అదే సంవత్సరం నుంచి ఈ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల బంధంతో షకీల్ ఎమ్మెల్యే అయ్యారా..? లేక కేసులో ఉన్న ఇతరుల పేర్లు బయటపెట్టకుండా ఉండేందుకే ఆయనకు ఎమ్మెల్యే పదవి తాయిలంగా ఇచ్చారా..? గత ప్రభుత్వంలో తెలంగాణ లెజిస్లేచర్ మైనార్టీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ హోదా కట్టబెట్టారా...? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
త్వరలో మరొకరి అరెస్ట్..?:
ఈ కేసుల పరంపరలో కొత్త నేర కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక కీలక నేతపై కేంద్ర నిఘావర్గాలు ఇప్పటికే సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఆ కీలక నేతను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
 
ఎలా బయటకు పొక్కింది:
బోధన్ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు ఆబిద్ ఒక సందర్భంలో ఇరిగేషన్ ఉద్యోగులను బూతులు తిట్టారు. ఈ విషయంలో ఆశాఖ ఉన్నత ఉద్యోగి ఒకరు భాజాపా సానుభూతి పరుడు. ఇటీవల కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే షకీల్ గురించి ప్రత్యేకంగా ఓ ఫిర్యాదు పంపారు. దీంతో తీగ లాగటం మొదలైనట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబానికి ఈ షకీల్ అమీర్ అత్యంత సన్నిహితుడు కావడం కొసమెరుపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments