Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి ప్రవేశించిన నల్లత్రాచు... చిన్నారులు మాత్రమే వుండటంతో..

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (11:42 IST)
అర్ధరాత్రి వేళ ఓ నల్లత్రాచు కలకలం రేపింది. పాము ఇంట్లో దూరిన సమయంలో కేవలం చిన్నారులు మాత్రమే ఉండటంతో వారు వారు భయంతో వణికిపోయారు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ఎయిర్‌పోర్ట్ కాలనీలో నివాసం ఉంటే అక్బర్ అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి వేళ నల్లత్రాచు పాము మెల్లగా దూరింది. ఇంట్లోకి దూరి హల్ చల్ చేసింది.

అయితే పాము ఇంట్లోకి వచ్చిన సమయంలో కేవలం చిన్న పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. దీంతో వారు పామును గమనించి గజగజ వణికిపోయారు. భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వారి కేకలు విన్న కాలనీవాసులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
 
నల్లత్రాచును చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్బర్ నివాసం వద్దకు చేరుకున్నారు. జనాన్ని చూసిన పాము కదలకుండా అక్కడే నిలబడి పోయింది. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఖమ్మంలో బైక్‌లో నుంచి బయటపడ్డ పాము.. కొద్ది రోజుల కిందట ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి బైక్‌లో పాము కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments