తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ సిద్ధం...

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (12:52 IST)
తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. మునుగోడు బహిరంగ సభతో తెలంగాణలో అధికార పీఠానికి మార్గం సుగమం చేసుకోవాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఇక మునుగోడు సభలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం సాగుతోంది. 
 
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బీజేపీ సభకు రానున్న అమిత్‌ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగసభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు జరిగాయి. కాగా.. అమిత్ షా మునుగోడు షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. 
 
మధ్యాహ్నం 2 గంటలకు స్పెషల్ ఫైయిట్‌లో ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. బేగంపేట్‌ నుంచి నేరుగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం బేగంపేట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడుకు వెళ్లనున్నారు అమిత్ షా. 
 
సభ అనంతరం మునుగోడు నుంచి రోడ్డు మార్గన హైదరాబాద్‌లోని నోవాటెల్‌కు చేరుకుంటారు. తిరిగి రాత్రి 10 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు పెళ్లని ఎవరు చెప్పారు.. వదంతులు భలే పుట్టిస్తారబ్బా : మీనాక్షి చౌదరి

Jana Nayakudu: జననాయకుడు ఎఫెక్ట్.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న భగవంత్ కేసరి.. ఎలా?

క్షమించండి రాశిగారు, నేను ఆ మాట అనడం తప్పే: యాంకర్ అనసూయ

Akhil: లెనిన్ నుంచి అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే పై రొమాంటిక్ సాంగ్

ముంబైలో ప్రభాస్... రాజా సాబ్ నుంచి నాచె నాచె.. సాంగ్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రాగులతో చేసిన రొట్టెలు తినకుండా వుండరు

వాకింగ్ ఎలా చేస్తే ఆరోగ్యకరం?

2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ

Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments