Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న రాష్ట్రాలకు ఎన్డీయే బీజం.. అందువల్లే తెలంగాణ : అమిత్ షా

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (18:55 IST)
గత ఎన్డీయే ప్రభుత్వం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజం వేయడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అదేసమయంలో తెలంగాణ కోసం తొలిసారి తీర్మానం చేసిన ఘనత తమదేనన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ పార్టీ ఎంతగానో కృషి చేసిందని ఆయన గుర్తు చేశారు. 
 
రెండు రోజుల పర్యటన కోసం గురువారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గ్రేటర్ హైదరాబాద్ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. తెలంగాణ కోసం తొలుత తీర్మానం చేసింది బీజేపీయేనని గుర్తు చేశారు. తెలంగాణ కోసం మొదట నుంచి కృషి చేసింది బీజేపీయేనని తెలిపారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజం చేసింది నాటి ఎన్డీయే ప్రభుత్వమేనని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేశారు. 
 
గతంలో మూడు రాష్ట్రాలను బీజేపీ ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు కలసిమెలసి అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ రాజకీయాలతో రాష్ట్ర విభజనలో లోపాలు తలెత్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుత తరుణంలో దేశాన్ని రక్షించేది మోడీ నేతృత్వంలోని బీజేపీయేనని ఆయన స్పష్టం చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments