Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌ తరలింపు!

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (07:40 IST)
ఆసియాలోనే అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు కొత్తపేటతో ఉన్న మూడున్నర దశాబ్దాల అనుబంధం వీడనుంది. చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాలకు ల్యాండ్‌మార్క్‌గా ఉన్న గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ కొహెడకు తరలిపోనుంది.

ఈ నెల 19న జరిగిన కేబినెట్‌ సమావేశంలో గడ్డిఅన్నారం మార్కెట్‌ స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలో కొత్తపేట నుంచి నగరశివార్లలోకి మార్కెట్‌ తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
 
నాడు నగర శివారు ప్రాంతంగా ఉన్న కొత్తపేట కాలక్రమేణా నగరంలో కలిసి రద్దీ ప్రాంతంగా మారింది.  మామిడి, బత్తాయి సీజన్‌లలో మార్కెట్‌కు ప్రతిరోజూ ఐదారు వందల లారీలు వస్తుంటాయి. దీంతో మార్కెట్‌కు ఇరువైపులా కిలోమీటరు మేర వాహనాలు రోడ్లపై బారులు తీరుతుంటాయి.

ఈ ట్రాఫిక్‌ రద్దీని నివారించడంతోపాటు జిల్లాల నుంచి సరుకును తీసుకువచ్చే రైతులకు కూడా అందుబాటులో ఉండేలా ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలో కొహెడలో మార్కెట్‌ ఏర్పాటుకు వంద ఎకరాల స్థలాన్ని కెటాయిస్తూ గతంలో వైఎస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
తెలంగాణ ఏర్పాటైన తరువాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదనంగా మరో 78 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించి మొత్తం 178 ఎకరాల్లో మార్కెట్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 2020 వేసవిలో మామిడి సీజన్‌ను కొహెడలోనే నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్లను కూడా ఏర్పాటు చేసింది.

అయితే గాలివాన బీభత్సానికి షెడ్లు నేలమట్టం కావడంతో తిరిగి గడ్డిఅన్నారం మార్కెట్‌లో క్రయ,విక్రయాలు చేపట్టారు. అయితే మంత్రి మండలి తాజా ఆమోదంతో త్వరలోనే మార్కెట్‌ తరలింపు పనులు మొదలుపెట్టే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు

ఇకపై అలాంటి సినిమాలు చేయను.. రామ్ గోపాల్ వర్మ

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశాం : డా.మోహన్ బాబు

హను రాఘవపూడి లాంచ్ చేసిన అలనాటి రామచంద్రుడు నుంచి నాన్న సాంగ్

బాల్యం నుంచి బాధ్యతకు ఎదిగిన కమిటీ కుర్రోళ్ళు’ టీజర్ ఆవిషరించిన నితిన్

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments