Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య అలాంటిది కాదు : బ్యూటీషియన్ శిరీష భర్త ఆవేదన

హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో అనుమానాస్ప‌దంగా మృతి చెందిన‌ బ్యూటీషియన్‌ శిరీషకు, ప్ర‌భాక‌ర్ ఘటనకు సంబంధం ఉందంటూ పోలీసులు చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌పై శిరీష భ‌ర్త సతీశ్‌ చంద్ర స్పందించారు. తన భార్య అలాంటిది కాదన

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (08:57 IST)
హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో అనుమానాస్ప‌దంగా మృతి చెందిన‌ బ్యూటీషియన్‌ శిరీషకు, ప్ర‌భాక‌ర్ ఘటనకు సంబంధం ఉందంటూ పోలీసులు చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌పై శిరీష భ‌ర్త సతీశ్‌ చంద్ర స్పందించారు. తన భార్య అలాంటిది కాదనీ, కానీ, తన భార్య మృతిపై గంటకో విష‌యం బ‌య‌ట‌కు రావడం తనను ఆవేదనకు గురి చేస్తోందని వాపోయారు. ఈ విషయంలో తనకేమీ అర్థం కావడం లేదన్నారు. 
 
కాగా, రెండు రోజుల క్రితం కూడా తన భార్య‌తో ఫోన్‌లో మాట్లాడాన‌ని, అపుడు కూడా ఆమె సంతోషంగానే మాట్లాడిందని చెప్పారు. త‌న భార్య మృతిపై విచారణ చేయాలని తాను పోలీసులను కోరుతున్నట్టు చెప్పారు. పోలీసులు చెబుతున్న కుకునూరు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఎవరో తనకు అస‌లు తెలియదని అన్నారు. తాను ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. త‌న  భార్య ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాద‌ని అన్నారు. 
 
కాగా, తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరులో ఎస్.ఐ ప్ర‌భాక‌ర్ రెడ్డి తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments